Childhood Pic: క్యూట్ గా ఉన్న చిన్నారి బాగా ఫేమస్ స్టార్ హీరోయిన్…ఎవరో ఊహించగలరా…!

NEWS DESK
2 Min Read

Childhood Pic: అప్పట్లో సినిమా హీరోల,హీరోయిన్ల రేర్ పిక్స్,చిన్ననాటి ఫోటోలు,సినిమా షూటింగ్ లకు సంబంధించిన ఫోటోలు కనిపిస్తే అభిమానులు సర్ప్రైజ్ అయ్యేవారు.ఇక హీరోయిన్ ల చిన్ననాటి క్యూట్ ఫోటోలు అయితే అందరిని ఆకట్టుకుంటాయి.ప్రస్తుతం ఇదే క్రమంలో ఒక స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.క్యూట్ గా ఉన్న ఈమె తెలుగు,తమిళ్,హిందీ,మలయాళంలో పలు సినిమాలలో నటించి తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.ఈమె కన్నడ లో కూడా నటించి ఉంటె పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని ఉండేది.ఈ ఫొటోలో క్యూట్ గా చిన్నారి ఎవరో కాదు ఆసిన్.

ఇటీవలే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోని విడిపోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఆ తర్వాత అదంతా ఫెక్ వార్తలు అంటూ క్లారిటీ ఇచ్చింది ఆసిన్.ఆసిన్ తన 15 వ ఏటా 2001 నరేంద్రన్ మాకెన్ జయకాంతన్ వక అనే మలయాళం సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి అనే సినిమాతో రవి తేజ కు జోడిగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.తక్కువ టైం లోనే వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తెలుగులో శివమణి,ఘర్షణ,లక్ష్మి నరసింహ,చక్రం,గజినీ,మజా,దశావతారం వంటి పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించింది.ఆసిన్ హీరో పవన్ కళ్యాణ్ కు జోడిగా అన్నవరం సినిమాలో చివరిసారిగా నటించింది.అమిర్ ఖాన్ గజినీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఆసిన్.సల్మాన్ ఖాన్,అక్షయ్ కుమార్,అభిషేక్ బచ్చన్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.ఈమె పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.ఆసిన్ మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ అయినా రాహుల్ శర్మ ను 2016 లో పెళ్లి చేసుకుంది.పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తన పర్సనల్ లైఫ్ తో బిజీ గా గడుపుతుంది ఆసిన్.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *