ఏ కారణాల వలన పాదాల వాపు వస్తుందో తెలుసా…ఈ చిన్న చిట్కాలతో నయం చేసుకోండి….

swollen feet telugu

శరీరంలో అప్పుడప్పుడు కొన్ని భాగాలూ వాపులకు గురవడం చాల మంది గమనించే ఉంటారు.అయితే సహజంగా వాపులు అనేవి ఏదైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు వస్తుంటాయి.కానీ కొంత మందిలో మాత్రం పాదాల వాపులు ఎక్కువగా వస్తుంటాయి.అయితే ఇలా పాదాల వాపులు అనేవి అనేక కారణాల వలన కూడా కావచ్చు.గాయాలు,ఇన్ఫెక్షన్లు,కిడ్నీ సమస్యలు,కీళ్ల నొప్పులు వంటి అనేక కారణాల వలన కూడా పాదాల వాపుకు కారణం కావచ్చు.అయితే కొన్ని చిట్కాలు పాటించడం వలన ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.అవి ఏంటంటే…గోరువెచ్చని నీటిని ఒక బకెట్ లో తీసుకోని అందులో కొద్దిగా రాక్ సాల్ట్ ను వేసి కలపాలి.

Advertisement

పాదాలు మునిగేలా ఆ బకెట్ లో ఉంచాలి.ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు రోజుకు రెండు సార్లు చెయ్యాలి.ఇలా ప్రతి రోజు చేయడం వలన పాదాల వాపు తగ్గిపోతుంది.రాక్ సాల్ట్ లో ఉండే యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలు పాదాల వాపును తగ్గించడంలో సహాయం చేస్తాయి.ఇలా పాదాల వాపులు ఉన్న వారు నిద్రపోయే సమయంలో పాదాల కింద మెత్తటి వస్తువులు కానీ దిండు కానీ పెట్టుకోవాలి.ఇలా ఎత్తులో పాదాలు ఉంచటం వలన అందులో ఉండే నీరు కిందకు దిగుతుంది.అది రక్త సరఫరాలో కసిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తుంది.ఇలా చేయడం వలన కూడా పాదాల వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.

swollen feet telugu
Swollen Feet

పాదాల వాపును తగ్గించుకోవడంలో పుచ్చకాయలు కూడా బాగా సహాయ పడతాయి.పుచ్చకాయలలో 92 శాతం నీరు మరియు సహజసిద్దమైనా డైయూరేటిక్ పదార్థాలు ఉంటాయి.ఇవి పదాలలో ఉండే ద్రవాన్ని తగ్గించడంలో సహాయం చేస్తాయి.పాదాల వాపు ఉన్నవారు ప్రతి రోజు ఒక కప్పు ఈ ముక్కలను తింటే మంచి ఫలితాన్ని గమనించవచ్చు.ధనియాలలో ఉండే యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలు కూడా పాదాల వాపును తగ్గించడంలో బాగా సహాయం చేస్తాయి.ధనియాలు ఆయుర్వేదంలో పాదాల వాపునూ తగ్గించడంలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్న సంగతి చాల మందికి తెలిసే ఉంటుంది.ఒక కప్పు నీటిలో ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసి నీరు సగం అయ్యేవరకు బాగా మరిగించాలి.ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లార్చాలి.ఇలా రోజుకు రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తాగడం వలన పాదాల వాపు తగ్గుతుంది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *