Tuesday, October 20, 20264:51 am
☀AQILIVE
Breaking News
Jailer 2 Trailer: రజినీకాంత్ మాస్ రిటర్న్.. అక్టోబర్ 15న రిలీజ్Vaishnavi Chaitanya age: నా వయసు 25 అని క్లారిటీBay of Bengal Depression: ఏపీలో భారీ వర్షాలకు హెచ్చరికTelangana 2BHK Houses: 21 వేల ఇళ్లు సిద్ధం.. 30లోగా లక్కీడ్రాRaaka 37 Poster: అల్లు అర్జున్–అట్లీ ‘రాకా’లో ఈ నంబర్ మిస్టరీ ఏంటి?
తెలుగు వార్తలు » తెలంగాణ » Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గుడ్ న్యూస్.. బేస్మెంట్ పూర్తి చేసిన వారి…

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గుడ్ న్యూస్.. బేస్మెంట్ పూర్తి చేసిన వారి అకౌంట్లో రూ. లక్ష పడినట్లే

Indiramma Housing Scheme: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అత్యంత ప్రాధాన్యత పథకంగా తెలిపారు. తాజాగా వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు పనులపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ…

AT A GLANCE

Indiramma Housing Scheme: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అత్యంత ప్రాధాన్యత పథకంగా తెలిపారు. తాజాగా వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు పనులపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ…

Published By: Gopi KrishnaUpdated On: Thursday, 17 September 2026, 9:56 · 9:56 am◷ 2 min read
UpdatedThursday, 17 September 2026, 9:56 · 9:56 am
⚡ HelloBD Shorts

Indiramma Housing Scheme: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం అత్యంత ప్రాధాన్యత పథకంగా తెలిపారు. తాజాగా వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రాజెక్టు పనులపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసిన ఇళ్ల లబ్ధిదారులకు అత్యంత వేగంగా డబ్బులు చెల్లించాలని అధికారులకు ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల ప్రాజెక్టులో పనుల వేగాన్ని పెంచడానికి ముఖ్యంగా బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు డబ్బు చెల్లింపులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజాగా అధికారులకు సూచించారు.

తాజాగా వరంగల్ జిల్లాలో సచివాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చ నిర్వహించారు. ఈ క్రమంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మరియు పలువురు ఇతర అధికారులు కూడా పాల్గొనడం జరిగింది.

ఇది చదవండి: రేషన్ కార్డులు 4 రంగులలో ఉంటాయి.. ఏ రంగు కార్డుకి ఎక్కువ ప్రయోజనాలు తెలుసా.!

ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టుగా తెలిపారు. దీనిని విజయవంతంగా పూర్తి చేయడం చాలా ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి కలెక్టర్లు పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి డబ్బులను నాలుగు విడతలలో మంజూరు చేస్తామని ఆయన చెప్పుకొచ్చా. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇళ్లకు మొదటి విడతగా లక్ష రూపాయలు అందించాల్సి ఉంది.

వీటికి సంబంధించిన ఇళ్ల వివరాలను హౌసింగ్ విభాగానికి పంపినట్లయితే వెంటనే ఆ చెల్లింపులు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికీ కొన్ని సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే.

ఉదాహరణకు చెప్పాలంటే ఇళ్ల స్థలాలు లేని లేదా అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు టు బిహెచ్కె ఇల్లు కేటాయించకపోవడం అలాగే మొండి గోడలతో ఉన్న ఇళ్లను ఇప్పటికి పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి సమస్యల గురించి ఈ సమావేశంలో మంత్రి ప్రస్తావించారు. ఈ క్రమంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారుల పూర్తి చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించబడుతుంది అని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Written by

Gopi Krishna

Gopi Krishna is a Telugu digital news writer and editorial contributor at HelloBDNewz.com, covering Andhra Pradesh, Telangana, national news, government schemes, business, entertainment, technology and trending topics. The editorial focus is on providing timely, accurate and easy-to-understand information for Telugu readers.

More by this Author

Read Next

HELLOBD NEWS

Stay Connected with HelloBD News

Breaking news, important updates and top Telugu stories — wherever you read.