Home సినిమా Jyothi Rana: మహేష్ బాబు పోకిరి సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో..ఏం...

Jyothi Rana: మహేష్ బాబు పోకిరి సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో..ఏం చేస్తుందో తెలుసా..!

0
Jyothi Rana
Jyothi Rana

Jyothi Rana: సినిమా ఇండస్ట్రీలో కొంత మంది నటీనటులు తాము చేసింది చిన్న క్యారక్టర్ అయినా కూడా తమ క్యారక్టర్ తో డైలాగ్ తో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు.అలా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే వాళ్ళల్లో ఈమె కూడా ఒకరు అని చెప్పచ్చు.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.2006 సంవత్సరంలో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో పాటు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో హీరో మహేష్ కు జోడిగా ఇలియానా నటించింది.ఇక ప్రకాష్ రాజ్,నాజర్,అజయ్,బ్రమ్మానందం,అలీ,ఆశిష్ విద్యార్థి తది తరులు ప్రముఖ పాత్రలలో నటించారు.అయితే ఈ సినిమాలో కాసేపే నటించిన ఒక నటి మాత్రం ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుంది.అప్పట్లో ప్రకాష్ రాజ్ గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ యెంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే.విలన్ గ్యాంగ్ లో కనిపించిన ఈ నటి పేరు జ్యోతి రానా.

ఈ బొంబాయి బ్యూటీ పోకిరి సినిమాలో కనిపించేది కొంచెం సేపే అయినా కూడా ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది.బాంబే లో పుట్టి పెరిగిన ఈమె అక్కడ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్టర్ గా కూడా రాణిస్తుంది.ఈమె తన వర్క్ అవుట్ వీడియోస్,లేటెస్ట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.

Previous articleAnasuya: ఫారిన్ లో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ…ఫోటోలు వైరల్..!
Next articleMagadheera: మగధీర సినిమాను ఆ ఒక్క కారణంతో వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here