వాస్తు దోషాలు తొలగిపోయి ధనవంతులు కావాలని అనుకుంటున్నారా…అయితే వెంటనే ఇలా చేయండి…

ప్రతి మనిషి తన జీవితంలో డబ్బు బాగా సంపాదించి మంచి లైఫ్ స్టైల్ గడపాలని అనుకుంటారు.కానీ ఒక్కోసారి యెంత కష్టపడి సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలువ ఉండదు.అలా ఆశించిన ఫలితాలు రాక నిరాశకు గురవుతారు చాల మంది.అయితే వాస్తు శాస్త్రంలో వీటన్నిటికీ పరిష్కారం ఉంది.వాటిని పాటించడం వలన ఇటువంటి డబ్బు సమస్యల నుంచి బయట పడవచ్చు.ఇలా యెంత డబ్బు సంపాదించినా నిలువ ఉండకపోవడం అనేది వాస్తు దోషం లేదా ఏదైనా గ్రాహం చెడు స్థితి కారణంగా కూడా జరుగుతుంది.సంపదను పొందడం వంటి వాటి గురించి గ్రంధాలలో చాల మార్గాలు ఉన్నాయి.

అవి చేపట్టడం వలన సంపదను కలిగిన వ్యక్తిగా మారడానికి కలిగే అడ్డంకులు తొలగిపోతాయి అని వాస్తు శాస్త్ర నిపుణులు చెపుతున్నారు.భోపాల్ లో నివసించే పొదర్ అనే జ్యోతిష్యుడు ఒక పరిహారం తెలిపారు.దీనిని ఆచరించడం వలన ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.అవి ఏంటంటే..హిందూ మతంలో ఏనుగును పవిత్రమైన జంతువుగా పరిగణిస్తారు అనే విషయం చాల మందికి తెలిసిందే.దానిని పూజించడం పవిత్రమైనదిగా పరిగణిస్తారు.ఏనుగును పెంచే వాళ్ళకి డబ్బుకు లోటు ఉండదని కానీ ఈ రోజుల్లో అంత భారీ జంతువును పెంచడం అనేది ఎవరికి సాధ్యం కాదని నమ్ముతారు.కానీ దానికి కూడా పండితులు ఒక పరిష్కారం తెలిపారు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వెండితో చేసిన ఏనుగును పవిత్రమైనదిగా భావిస్తారు కాబట్టి ఇంట్లోకి వెండితో చేసిన ఏనుగును తీసుకురావచ్చు.వెండితో చేసిన ఏనుగును ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం వలన అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి అని నిపుణులు చెపుతున్నారు.వాస్తు దోషాలు తొలగిపోవడం వలన ఆ ఇంట్లో లక్ష్మి దేవి నివసిస్తుంది.ఇంట్లో లేదా కార్యాలయంలో టేబుల్ మీద ఇలా వెండి తో చేసిన చిన్న లేదా పెద్ద ఏనుగును ఉంచినట్లయితే వ్యక్తి అభివృద్ధి చెంది సంపద ఏర్పడుతుంది.ఇలా వెండి తో చేసిన ఏనుగును ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలని నిపుణులు చెపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *