Ram Charan: బాలయ్య అన్ స్థాపబుల్ షోలో రామ్ చరణ్ వేసుకొచ్చిన హూడి ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!

Ram Charan
Ram Charan

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు టీజర్ అన్నీ కూడా బాగా పాపులర్ అయ్యి ప్రేక్షకులలో భారీగా అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ జనవరి రెండున రిలీజ్ అవుతుంది. సినిమా యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో రామ్ చరణ్ (Ram Charan) బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో (Unstoppable Show) పాల్గొన్నారు. నిన్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ శర్వానంద్, నిర్మాత విక్రం రెడ్డి కూడా ఈ షోలో సందడి చేశారు.

ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ షోలో రామ్ చరణ్ బ్లాక్ కలర్ హూడి లో కనిపించారు. బ్లాక్ కలర్ తో చేతుల మీద వైట్, రెడ్ కలర్స్ లో డిజైన్ తో ఉన్న ఈ  హూడి  ధర  గురించి తెలుసుకోవడానికి ఫాన్స్ బాగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ధరించిన అమీరి బ్రాండ్ హూడి ధర ఒక లక్ష పదివేలకు పైగా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now