Vastu Tips: వాస్తు ప్రకారం ఆగిపోయిన లేదా విరిగిపోయిన వాచ్ చేతికి ధరిస్తే జరిగే నష్టాలు ఇవే

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమయం చూపించే గడియారం ఉంటుంది. అయితే ఈ గడియారాలను రకరకాల రూపాలలో ఉపయోగిస్తూ ఉంటారు. చేతికి సమయం తెలుసుకోవడానికి వాచ్ ధరిస్తారు. అలాగే గడియారాన్ని ఇంట్లో గోడకు కూడా వేలాడదీస్తారు. కొంతమంది టేబుల్ పై కూడా రకరకాల గడియారాలు పెట్టుకుంటారు. అయితే గడియారంలో చూపించే సమయాన్ని చాలా విలువైనదిగా గుర్తించిన వ్యక్తులు అందరూ కూడా తమ జీవితంలో చాలా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కానీ ఇంట్లో గడియారాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం పెట్టుకోకపోతే మాత్రం ఆ ఇంట్లో చాలా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి.

అలాగే విరిగిపోయినా లేదా ఆగిపోయిన వాచ్ ని కూడా చేతికి ధరించకూడదు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇలా ఆగిపోయినా లేదా విరిగిపోయిన వాచ్ చేతికి ధరించడం అసౌకర్యానికి గురి చేయడం మాత్రమే కాకుండా అది వాళ్ళ జీవితంలో శక్తి ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అంటూ జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. సమయం గడిచే కొద్దీ మీ ఇంట్లో ఉన్న గడియారాలు మీ జీవిత లయతో మీ సంబంధాన్ని సూచిస్తాయి అని నిపుణులు అంటున్నారు. విరిగిపోయిన లేదా ఆగిపోయిన వాచ్ భరించడం చాలా ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు.

జీవితంలో విజయం సాధించడం కోసం శక్తి ప్రవాహం చాలా ముఖ్యం. కాబట్టి పాడైపోయిన గడియారాన్ని చేతికి ధరించడం వలన జీవితంలో ఆలస్యం లేదా అడ్డంకులు ఏర్పడతాయి. ఒకవేళ మీరు పాడైపోయినా లేదా విరిగిపోయిన వాచ్ ను ధరించినట్లయితే మీ జీవితంలో మీరు ముందుకు సాగలేక పోతున్నారు అని లేదా మీ లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని నమ్ముతారు. కాబట్టి పాడిపోయిన గడియారాన్ని ధరించిన వాళ్ళు తమకు తెలియకుండానే తమ కెరియర్ వృద్ధిలో లేదా సరైన నిర్ణయం తీసుకోవడంలో జాతీయ జరగవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. కాలం చాలా విలువైనది. మన జీవితంలో జరిగే వ్యక్తిగత విజయాల దగ్గర నుంచి వృత్తిపరమైన విజయాల వరకు అన్నిటిని కూడా ఈ కాలం నియంత్రిస్తుంది.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now