Gold Loan: కొత్త రూల్ ప్రకారం బంగారంపై తీసుకున్న లోన్ తిరిగి సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుందో తెలుసా..!

Gold Loan
Gold Loan

Gold Loan: ప్రతి ఒక్కరు కూడా తమ ఆర్థిక అవసరాల కోసం ఏదో ఒక సందర్భంలో బ్యాంకులో లేదా ఇతర ఆర్థిక సంస్థల బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్ పొందినప్పుడు ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. బంగారంపై మీకు చాలా తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుంది. కానీ మీరు సకాలంలో ఈ లోన్ తిరిగి చెల్లించడం చాలా అవసరం. లేకపోతే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాలి. అయితే బంగారంపై లోన్ ఈక్వయిటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ వడ్డీ లేదా అసలు సకాలంలో చెల్లించకపోతే బంగారంపై మీరు తీసుకున్న లోన్ డిఫాల్ట్ అవుతుంది.

సెక్యూరిటీగా బంగారాన్ని ఉంచుకొని బ్యాంకు మీకు లోన్ ఇచ్చినప్పటికీ మీరు చేసిన లేట్ పేమెంట్స్ వలన మీ క్రెడిట్ స్కోర్ అలాగే ఫైనాన్షియల్ హెల్త్ కూడా ప్రభావితం అవుతున్నాయి. మీరు తీసుకున్న లోన్ కి సదరు బ్యాంక్ మీకు ఎడిషనల్ చార్జెస్, పెనాల్టీలు కూడా వేస్తుంది. అప్పుడు మీరు ఈ లోన్ తిరిగి చెల్లించాలి అంటే ఎక్కువ మనీ పెట్టాల్సి ఉంటుంది. సంబంధిత బ్యాంక్ అధికారులు డిఫాల్ట్ గురించి క్రెడిట్ బ్యూరోలకు చెప్తారు. అప్పుడు మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది.

ఈ క్రెడిట్ స్కోర్ తగ్గితే మీకు భవిష్యత్తులో బ్యాంకు నుంచి లోన్లు అలాగే క్రెడిట్ కార్డ్ పొందడం చాలా కష్టం. ఎక్కువ వడ్డీ రేట్లకు మీరు లోన్ తీసుకోవాల్సి వస్తుంది. మీకు రెడీ హిస్టరీలో 7 ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది. భవిష్యత్తులో మీరు లోన్ పొందడానికి చాలా కష్టంగా మారుతుంది. 30 నుంచి 90 రోజులలోపు మీరు తీసుకున్న లోన్ తిరిగి బ్యాంకుకు చెల్లించకపోతే సదరు బ్యాంకు రికవరీ ప్రాసెస్ మొదలు పెడుతుంది. తాకట్టుగా పెట్టుకున్న బంగారాన్ని బ్యాంకు వేలంలో అమ్మవచ్చు. వేలం వేసిన తర్వాత ఆ బంగారంపై మీకు ఎటువంటి హక్కులు ఉండవు. ఒకవేళ వేలం వేసిన తర్వాత లోన్ అమౌంట్ కంటే తక్కువగా డబ్బులు వచ్చినట్లయితే ఆ మిగిలిన డబ్బులను కూడా మీరే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now