Chatrapathi Chandrasekhar: ఛత్రపతి చంద్రశేఖర్ భార్య కూడా మనకు బాగా తెలిసిన సినిమా నటి..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

Chatrapathi Chandrasekhar
Chatrapathi Chandrasekhar

Chatrapathi Chandrasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రశేఖర్.ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఛత్రపతి లో భద్రం పాత్రతో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందారు చంద్రశేఖర్.బాహుబలి సినిమాలో తప్పించి రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోనూ చంద్రశేఖర్ నటించడం జరిగింది.సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

బాహుబలి లో చంద్రశేఖర్ ఎందుకు నటించలేదు అనే అనుమానం చాల మంది ప్రేక్షకులలో కలిగింది అని చెప్పచ్చు.బాహుబలి సినిమాలో కూడా చంద్రశేఖర్ పాత్ర ఉందట..కానీ ఆ పాత్ర సినిమాకి అడ్డంకిగా ఉంటుందని దర్శకుడు చెప్పడంతో..అలాగే చంద్రశేఖర్ కు కూడా ఆ పాత్ర నచ్చకపోవడంతో బాహుబలి నుంచి తప్పుకున్నారని సమాచారం.ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమాలో చంద్రశేఖర్ నటించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే చంద్రశేఖర్ భార్య గురించి చాల తక్కువ మందికి తెలిసి ఉంటుంది.చంద్రశేఖర్ భార్య పేరు నిలియా భవాని.ఈమె కూడా సినిమా నటి అన్న విషయం బహుశా చాల మందికి తెలియక పోవచ్చు.ఈమె పండగ చేస్కో,కిక్ 2 ,సైరా,నాని జెంటిల్ మ్యాన్ వంటి చిత్రాలలో నటించడం జరిగింది.ఈమె కూడా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.చంద్రశేఖర్ నిలియా భవాని ప్రేమ వివాహం చేసుకున్నారు.

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now