Ravi Teja: రవితేజ పక్కన భార్యగా మరియు వదినగా నటించిన ఒకే ఒక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా…!

Ravi Teja: సినిమా అనే కల్పిత ప్రపంచంలో చాల వింతలూ జరుగుతూనే ఉంటాయి.సినిమాలలో ఒక హీరో పక్కన భార్యగా నటించిన హీరోయిన్లు ఆ తర్వాతి సినిమాలలో చెల్లిగానో,లేదా మరో పాత్రలో కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.సినిమాలలో ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతూనే ఉంటాయి.పాత్ర డిమాండ్ ను బట్టి ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనలిటీ అనేది చాల ముఖ్యం.మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనే దాని కన్నా మన పాత్రకు మనం న్యాయం చేశామా లేదా అనేది చాల ముఖ్యం.ఈ క్రమంలోనే హీరోయిన్ శృతిహాసన్ ఒక హీరోకు భార్యగా నటించింది.అయితే ప్రస్తుతం ఆమె అదే హీరోకు వదిన పాత్రలో కనిపించనుంది.

తాజాగా శృతిహాసన్ బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో హీరో చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు.ఇక ఇదే సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో రవితేజ పాత్రను తెలుపుతూ ఒక టీసర్ ను రిలీస్ చేసారు సినిమా యూనిట్.ఈ సినిమాలో ఎసిపి విక్రమ్ సాగర్ గా రవితేజ హీరో చిరంజీవి కు సవతి సోదరుడిగా కనిపించనున్నారు.అయితే హీరోయిన్ శృతిహాసన్ హీరో రవితేజ కు క్రాక్ సినిమాలో భార్యగా నటించిన సంగతి అందరికి తెలిసిందే.ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో శృతిహాసన్ రవితేజ కు వదిన పాత్రలో కనిపించనున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Comment