స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారు…కానీ ఆ హీరో చేసి ఉంటే ఎలా ఉండేదో…

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వం వహించిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ ఎంతటి ఘనవిజయం సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం హీరో గా జూనియర్ ఎన్టీఆర్ కు మరియు దర్శకుడిగా రాజమౌళి కి లైఫ్ ఇచ్చింది అని తెలుస్తుంది.వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట…వేరే హీరోను అనుకున్నారట.

Jr NTR Student No1
Jr NTR Student No1

తాజాగా ఈ చిత్ర నిర్మాత చలసాని అశ్వని దత్ ప్రముఖ షో అయినా అలీతో సరదాగా లో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.అయితే ముందుగా ఈ చిత్రానికి హీరో కోసం ప్రభాస్ ను అనుకున్నారట.కానీ ఎన్టీఆర్ తండ్రి అయినా దివంగత నటుడు హరికృష్ణ ఈ చిత్రంతో తన కొడుకును లాంచ్ చేయాలనీ అనుకోవడంతో నిర్ణయం మార్చుకున్నట్లు ఆయన తెలిపారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ ను ఈ సినిమాకు హీరోగా ఫైనల్ చేసినట్లు తెలిపారు.అయితే తాము ఊహించిన దాని కన్నా ఎన్టీఆర్ ఈ సినిమాలో చాల అద్భుతంగా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం 2001 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత 2003 సంవత్సరంలో తమిళ్ లో ఈ చిత్రాన్ని అదే టైటిల్ తో రీమేక్ చేయడం జరిగింది.

Rajamouli Prabhas
Rajamouli Prabhas

ఇక నిర్మాత ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రం గురించి మాట్లాడుతూ..ప్రాజెక్ట్ కె ఇప్పటికే 55 శాతం షూటింగ్ను పూర్తి చేసుకుందని తెలిపారు.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అవెంజర్స్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొనె నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *