March 26, 2023

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి ఇండస్ట్రీ లో చరిత్ర సృష్టించిన కృష్ణ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…

Sr NTR Superstar Krishna

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవి.ఈ స్టార్ హీరోల కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయని చెప్పచ్చు.ఏడాదిలో పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు.ఇక సూపర్ స్టార్ కృష్ణ సినిమా కెరీర్ లో ఎన్నో విభిన్న కథ చిత్రాలు మరియు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి.ఆయన నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా దర్శకుడిగా కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు.ఇక కృష్ణ సినిమా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో అల్లూరి సీతారామరాజు సినిమా కూడా ఒకటి అని చెప్పచ్చు.

అప్పట్లో రిలీజ్ అయినా ఈ చిత్రం ఎన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాలోని పాటలు ముఖ్యంగా తెలుగువీర లేవరా అనే పాట ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండిపోయింది.రామచంద్ర రావు దర్శకత్వం వహించిన అసాధ్యుడు సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు వేషం వేయడం జరిగింది.ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు కథను సిద్ధం చేసి దర్శకుడు రామచంద్ర రావు ముందుగా ఈ కథను ఎన్టీఆర్ గారికి వినిపించారు.

Sr NTR Superstar Krishna
Sr NTR Superstar Krishna

కథ విని అద్భుతంగ ఉందని చెప్పిన ఎన్టీఆర్ గారు కొన్ని కారణాల వలన ఈ సినిమాను రిజెక్ట్ చేసారు.ఆ తర్వాత ఈ కథను విన్న కృష్ణ ఒకే చెప్పి ఈ సినిమాను చేయడం జరిగింది.70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత దర్శకుడు రామచంద్ర రావు మృతి తర్వాత ఈ సినిమా ను కేఎస్ ఆర్ దాస్ మిగిలిన సినిమాను పూర్తి చేసారు.పద్మాలయ సంస్థ పై ఈ చిత్రాన్ని కృష్ణ నిర్మించారు.ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా ఈ చిత్రం మొదటి షో తోనే అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ కి అత్యున్నతమైన సినిమాగా నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *