మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హెయిర్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ డిఫరెంట్ హెయిర్ స్టైల్ ని మైంటైన్ చేస్తారు రామ్ చరణ్.రామ్ చరణ్ స్టార్ హీరో నుంచి పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ మరియు ఆచార్య చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఆ తర్వాత హీరో రామ్ చరణ్ ప్రముఖ దర్శకడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నారు.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ RC 15 సినిమాలో మరో కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించనున్నారు రామ్ చరణ్.ఈ చిత్రం రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి ఒక టీం ని పిలిపించారట.కేవలం రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కోసం రోజుకు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు చెల్లిస్తున్నారట.
ఇంకా హెయిర్ స్టైల్ టీం మొత్తానికి స్టార్ హోటల్ లో అకామిడేషన్,ఇంకా బిజినెస్ క్లాస్ టికెట్లు అన్ని కలిపి సినిమా పూర్తి అయ్యేసరికి కోటి రూపాయల వరకు అవుతాయని అంచనా వేస్తున్నారు.పాన్ ఇండియా చిత్రం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.అయితే సినిమా ఇండస్ట్రీ లో చాల మంది స్టార్ హీరోలు తమ హెయిర్ స్టైల్ కోసం భారీ మొత్తంలోనే ఖర్చు చేస్తున్నారట.