Home సినిమా పునీత్ కు కర్ణాటక రత్న అవార్డుతో గౌరవించిన కర్ణాటక ప్రభుత్వం..

పునీత్ కు కర్ణాటక రత్న అవార్డుతో గౌరవించిన కర్ణాటక ప్రభుత్వం..

0

కేవలం 46 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు.ఆయన మరణించిన తర్వాత కూడా అందరి హృదయాలలో నిలిచిపోవడానికి కారణం ఆయన చేసిన సేవ కార్యక్రమాలు అనే చెప్పచు.ఆయన మరణించి ఇన్ని రోజులు అయినా కూడా ఇప్పటికి ఆయన కుటుంబసభ్యులు కానీ అభిమానులు కానీ జీర్ణించుకోలేక పోతున్నారు.ప్రతి రోజు చాల మంది ఆయన సమాధి దగ్గరకు వచ్చి వెళ్తున్నారు.చాల ప్రేమ జంటలు కూడా ఆయన సమాధి దగ్గర వివాహం చేసుకునేందుకు వస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ తాను చేసే సేవ కార్యక్రమాలు ఎప్పటికి నిలిచిపోకుండా ఉండడానికి ఆయన ఉన్న లేకపోయినా సరే కొనసాగాలి అనే ఉద్దేశంతో ముందుగానే ఎనిమిది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది.ఇటీవలే బెంగళూరు లో జరిగిన సంతాప సభలో ప్రభుత్వ పెద్దలతో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీ నటి నటులు మరియు ఇతర సినిమా పరిశ్రమల ప్రముఖులు కూడా రావడం జరిగింది.కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అవార్డు అయినా కర్ణాటక రత్న అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు నివాళిగా ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా బసవరాజు బొమ్మై మాట్లాడుతూ పునీత్ నాకు చిన్నతనం నుంచి తెలుసు,చిన్నతనంలోనే బాల నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు అని చెప్పుకొచ్చారు.చిన్నతనం నుంచే పునీత్ రాజ్ కుమార్ చాల అద్భుతంగా నటించేవారు,చిన్నతనంలోనే అలా నటించడం సులువు కాదు అని బసవరాజు బొమ్మై చెప్పుకొచ్చారు.జాతీయ స్థాయిలో భారత రత్న అవార్డు అత్యున్నత పురస్కారం అలానే కర్ణాటక రాష్ట్ర స్థాయిలో కర్ణాటక రత్న అవార్డు అత్యున్నత పురస్కారం గా చెప్తారు.కర్ణాటక రాష్ట్ర స్థాయిలో విశేష కృషి చేసిన వాళ్లకు కర్ణాటక ప్రభుత్వం ఈ కర్ణాటక రత్న అవార్డును అందజేయడం జరుగుతుంది.1992 లో స్థాపించబడిన ఈ కర్ణాటక రత్న అవార్డు ఇప్పటికి పునీత్ తో కలిపి పది మందికి అందజేయడం జరిగింది.ఈ కర్ణాటక రత్న అవార్డుతో పాటు 50 గ్రాముల బంగారు పతకం మరియు కృతజ్ఞత పత్రం కూడా అందజేయడం జరుగుతుంది.

Previous articleట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ని ఎక్కడ నుంచి కాపీ చేసారంటే.!
Next articleప్రయాణంలో వాంతులతో ఇబ్బంది పడుతున్నారా….అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here