Home సినిమా పునీత్ ను చూసి కన్నీటి పర్యంతమైన బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్….!

పునీత్ ను చూసి కన్నీటి పర్యంతమైన బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్….!

0

కన్నడ పవర్ స్టార్ అయినా పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం రోజు గుండె పోటు కు గురై విక్రమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తన తుది శ్వాసను విడిచిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఆయన మరణ వార్త వినగానే సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ గురయ్యారు.ఆయన అభిమానులు కూడా ఆయన మరణ వార్త నుంచి కోలుకోలేకపోతున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా పునీత్ రాజ్ కుమార్ కు చాల మంది సన్నిహితులు ఉన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.టాలీవుడ్ సినిమా ప్రముఖులు కూడా అంతిమ నివాళి కోసం బెంగళూరు లోని పునీత్ రాజ్ కుమార్ నివాసానికి చేరుకుంటున్నారు.అక్కడికి చేరుకున్న నందమూరి బాలకృష్ణ పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.బాలయ్య కు పునీత్ రాజ్ కుమార్ కు విడదీయలేని అనుబంధం ఉందని చెప్పాలి.

చాల సార్లు బాలయ్య ఫంక్షన్స్ లో పునీత్ రాజ్ కుమార్ గెస్ట్ గా రావడం జరిగింది.అక్కడికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా పునీత్ ను చూసి కంట తడి పెట్టుకున్నారు.పునీత్ అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ ను చూడగానే ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు.

Previous articleచనిపోయిన కూడా ఇద్దరికీ వెలుగులు పంచిన గొప్ప వ్యక్తి పునీత్ రాజ్ కుమార్..!
Next articleతండ్రి కడచూపు కోసం పరుగు పరుగున బెంగళూరు చేరుకున్న పునీత్ కూతురు ధృతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here