Todays Gold Rate: మహిళలకు భారీ గుడ్ న్యూస్…మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మన దేశం మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ ఉన్న క్రమంలో మహిళలు బంగారం కొనడానికి ఎదురుచూస్తున్నారు. అటువంటి వారికి తగ్గుతున్న బంగారం ధరలు కొంత ఊరట కలిగిస్తున్నాయి. గతంలో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతికూల సుంకాల అమలును వాయిదా వేయడంతో అలాగే వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఈ పరిస్థితులు చెక్కబడ్డాయి. మరోపక్క భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడంతో ఇన్వెస్టర్లు కూడా బంగారం మీద కాకుండా ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి అంటూ నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్తోపాటు హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి.

స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఈరోజు పది రూపాయలు తగ్గింది. మూడు రోజుల నుంచి తులం బంగారంపై ఏకంగా రూ.610 తగ్గాయి. ప్రస్తుతం తులం బంగారం రేటు రూ.97,470. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.89,340. మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతున్నప్పటికీ వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,11,000 గా ఉంది.