Vastu Tips: ఇంట్లో ఈ 6 రకాల వస్తువులను పెట్టుకుంటే డబ్బే డబ్బు

Vastu Tips
Vastu Tips

Vastu Tips: ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు అన్ని సమస్యలకు ముఖ్య కారణం డబ్బు. అది ఆలస్యం అయితే మనలో ఆనందం తగ్గిపోతుంది. కొన్ని ప్రత్యేక వస్తువులను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుపు పడుతుందని వాస్తు శాస్త్రా నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు రావడానికి గల ముఖ్య కారణం ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడడం. ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి.

ఏనుగును తెలివితేటలతో సంపదతో కూడిన జీవిగా పరిగణిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఇంట్లో ఏనుగు వెండి విగ్రహాన్ని ఉంచినట్లయితే అదృష్టం మరియు ఆర్థిక ప్రగతి పెరుగుతాయని వాస్తు శాస్త్రా నిపుణులు సూచిస్తున్నారు. ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉత్తర దిశలో లేదా నైరుతి మూలలో పెట్టుకోవడం చాలా శుభప్రదం. చేప ఆరోగ్యానికి మరియు ధన ప్రాప్తికి చిహ్నంగా చెప్తారు. ఇంట్లో ఇవి సానుకూల శక్తిని పెంచుతాయి. వెండి లేదా ఇతడితో చేసిన చేప విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ధన లాభం కలుగుతుంది.

శ్రీకృష్ణుడి చేతిలో ఉండే వేణువు శాంతిని మరియు ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో వేణుగును పెట్టడం వలన చాలా శుభప్రదం. చాలా అరుదుగా దొరికితే ఒంటి కన్ను కొబ్బరికాయ చాలా ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. ఒంటి కన్ను కొబ్బరికాయను ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గోమతి చక్రం ఇంట్లో పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో నిధి ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇంట్లో కమల గట్టే పెట్టుకోవడం వలన ఆ ఇంట్లో ధనలక్ష్మి ఆశీస్సులు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు.