Home సినిమా Childhood Pic: వైట్ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరా…టాలీవుడ్ లో క్రేజ్...

Childhood Pic: వైట్ డ్రెస్ లో క్యూట్ గా ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరా…టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్..!

0
Childhood Pic

Childhood Pic: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఒక టాలీవుడ్ హీరోయిన్.తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది ఈ చిన్నది.వెండితెర మీద తన నవ్వుతో,తన చిలిపి చేష్టలతో అందరిని మంత్రముగ్దుల్ని చేసింది.పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత అందరు హీరోయిన్లు లాగానే పెళ్లి చేసుకొని తన భర్త తో,ఇద్దరు పిల్లలతో సెటిల్ అయిపొయింది.కానీ ఈ హీరోయిన్ ను ఇప్పుడు చూసిన కూడా ఇద్దరు పిల్లల తల్లిలాగే అస్సలు కనిపించదు.ఈ ఫొటోలో క్యూట్ గా చిన్నారి ఎవరో కాదు జెనీలియా డిసౌజా.జెనీలియా అంటే చాల మందికి తెలియదు కానీ బొమ్మరిల్లు హీరోయిన్ హ హా హాసిని అంటే మాత్రం యిట్టె గుర్తుపట్టేస్తారు.

జెనీలియా 35 వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఈమె చిన్ననాటి రేర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.2003 లో తుజే మేరీ ఖసం అనే సినిమాతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.తెలుగులో శంకర్ సినిమా బాయ్స్ లో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమాల సూపర్ హిట్ అవ్వడంతో అప్పట్లో హరిణి అనే ఆమె పాత్ర పేరు మారుమోగిపోయింది.సుమంత్ కు జోడిగా సత్యం సినిమాలో నటించింది జెనీలియా.

ఆ తర్వాత జెనీలియా తెలుగులో సాంబ,సై,నా అల్లుడు,సుభాష్ చంద్ర బోస్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.జెనిలియా కు మంచి గుర్తింపును తీసుకోని వచ్చిన సినిమా మాత్రం బొమ్మరిల్లు అని చెప్పచ్చు.ఈ సినిమా లో ఆమె హాసిని క్యారక్టర్ ఇప్పటికి ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయే ఇష్టమైన క్యారక్టర్.బొమ్మరిల్లు సినిమాను తమిళ్ లో మరియు హిందీలో కూడా ఆమె చేసింది.ఆ తర్వాత ఈమె వరుస అవకాశాలతో తమిళ్,తెలుగు,కన్నడ,మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీ గా అయిపొయింది.రానా హీరోగా చేసిన నా ఇష్టం సినిమాలో జెనీలియా చివరిసారిగా తెలుగులో నటించింది.2012 లో బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది జెనీలియా.

Previous articleMahesh Babu: మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించిన ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleSurekha Vani: తన కూతురు సుప్రీతా తో కలిసి అమెరికా వీధుల్లో సందడి చేస్తున్న నటి సురేఖావాణి…వీడియొ వైరల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here