స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఒక లైలా కోసం సినిమాలో నాగ చైతన్య కు జోడిగా నటించి తన అందంతో ఈమె ప్రేక్షకులను కట్టిపడేసింది అని చెప్పచ్చు.ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.సినిమాలో యెంత బిజీగా ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో కూడా అభిమానులకు చేరువలో ఉంటారు.తనకు సంబంధిచిన లేటెస్ట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.
గత కొన్ని రోజుల నుంచి ఈమె తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు.ఈమెకు ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి అయినా ఇంతలా గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం అవసరమా అంటూ కొంత మంది భావిస్తుంటే…కుర్రకారు మాత్రం ఈమె ఫోటోలకు మంత్ర ముగ్దులైపోతున్నారు అని చెప్పచ్చు.కొన్ని రోజుల క్రితం తన ఫోటో గ్రాఫర్ కు బర్త్ డే విషెస్ చెప్పడానికి కూడా ఈమె ఫోజులు ఇచ్చిన వీడియొ నెట్టింట్లో వైరల్ అయినా సంగతి అందరికి తెలిసిందే.
గత కొన్ని రోజుల నుంచి ఈమె గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటున్నారు.పూజ ఇంస్టాగ్రామ్ ఖాతాకు 19 మిలియన్ల ఫాలోవర్స్ ఉండడంతో ఈమె షేర్ చేసిన ఫోటోలు కాస్త క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.మ్యాగజైన్ కోసం పూజ చేసే ఫోటో షూట్లకు లక్షల్లో సంపాదన ఉంటుందని తెలుస్తుంది.చూపుతిప్పుకోలేని విధంగా ఈమె ఫొటోకు ఫోజులిచ్చిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.