అప్పట్లోనే బాలయ్య ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్…ఏమని అన్నారో తెలుసా…

SR NTR Bala Krishna

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకొని చాల మంది స్టార్ హీరోలుగా ఎదిగారు.ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న వాళ్ళు గతంలో ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు.తమ టాలెంట్ తో సంపాదించినా డబ్బులతో కొంత నలుగురికి సహాయం చేస్తారు.ఈ క్రమంలో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముందుగా అందరికి బాగా గుర్తొచ్చే పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.ఆయన పుట్టుకతో కోటీశ్వరుడు కాదు.తన అద్భుతమైన టాలెంట్ తో నట సార్వభౌముడిగా పేరు తెచ్చుకున్నారు.ఇక ఆయన లాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో మురళి మోహన్ కూడా ఉన్నారు.ఎంతో క్రమశిక్షణతో ఎన్టీఆర్ ను ఫాలో అయ్యి స్టార్ హీరోగా ఎదిగారు మురళి మోహన్.ఆ తర్వాత ఆయన హీరోగా చేస్తూనే జయభేరి సంస్థ ను స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించడం జరిగింది.

అయితే ఒక ఇంటర్వ్యూలో మురళి మోహన్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.ఎన్టీఆర్ సీఎం అయినా తర్వాత ఒక రోజు రాత్రి నాతొ పాటు కొంత మంది ఆయనను కలవడానికి వెళ్ళాము.అప్పుడు ఎన్టీఆర్ గారు రండి బ్రదర్ భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని పిలిచారు.ఆయనతో కలిసి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత షూటింగ్ విషయాలు మాట్లాడుకుంటూ ఉండగా ఎన్టీఆర్ ఐస్ క్రీం తిందామా బ్రదర్ అని అన్నారు.అప్పుడు ఒక పిల్లవాడిని పిలిచి ఏడు ఐస్ క్రీం లకు యెంత అవుతుందో చిల్లర లెక్కపెట్టి ఇచ్చారు.అది చూసి నాకు నవ్వు రావడంతో మురళి ఎందుకు నవ్వుతున్నావ్ అని ఎన్టీఆర్ నన్ను అడిగారు.చిల్లరకు బదులుగా వంద రూపాయలు ఇస్తే చిల్లర తిరిగి తీసుకువస్తాడు కదా సార్ అని నేను అన్నాను.

అప్పుడు ఎన్టీఆర్ గారు ఇది నేను చాల కష్టపడి సంపాదించినా డబ్బని,డబ్బులు ఖర్చు చేసే విషయంలో నేను చాల జాగ్రత్తగా ఉంటానని ఆయన తెలిపారట.పాలు పోసి జీవనం సాగించే సాధారణ కుటుంబంలో పుట్టిన నేను విజయవాడలో ఉదయాన్నే పాలు పోసి గుంటూరు వెళ్లి కష్టపడి చదువు కున్నాను.ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నప్పుడు కోట్ల సంపాదన ఉంది కదా అని ఎలా పడితే అలా ఖర్చు పెట్టాను.డబ్బులు ఆచి తూచి ఖర్చు చేస్తాను అని ఎన్టీఆర్ గారు మురళి మోహన్ తో చెప్పారట.కానీ నా కొడుకు బాలకృష్ణ ఒక పెద్ద స్టార్ ఇంట్లో పుట్టాడు..అతను పుట్టుకతోనే కోటీశ్వరుడు.వరద సహాయం కోసం ఎవరైనా వస్తే వెంటనే బాలయ్య లక్ష లేదా రెండు లక్షలు ఇస్తాడని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారట.మనం సంపాదించినా డబ్బు సద్వినియోగం అవ్వాలి కానీ దుర్వినియోగం అవ్వ కూడదు అని ఎన్టీఆర్ తెలిపారట.అలా ఎన్టీఆర్ బాలకృష్ణ ఖర్చుల విషయంలో ఆశ్చర్యపోయారని ఒక ఇంటర్వ్యూ లో మురళి మోహన్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *