Pilla Zamindar: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పిల్లజమీందార్ సినిమా హీరోయిన్..!

Pilla Zamindar
Pilla Zamindar

Pilla Zamindar: నేచురల్ స్టార్ నాని తెలుగులో తిరుగు లేని హీరోగా చెలామణి అవుతున్నాడు. తనకంటూ ఓ కొత్త ఒరవడిని క్రియేట్ చేసుకున్నాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు, దసరా, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. కెరీర్ తొలినాళ్ల నుంచి ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు నాని. కెరీర్ స్టార్టింగ్ లో చేసిన పిల్ల జమిందార్ తన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి. జి. అశోక్ డైరెక్షన్ లో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. 2011 లో వచ్చిన ఈ సినిమా తన కెరీర్ కు ఎంతో హెల్ప్ అయ్యింది.

ఈ సినిమా కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఆ తర్వాత నాని రాజమౌళి ఈగ సినిమాతో నేచురల్ స్టార్ గా మారిపోయారు. వరుస సినిమాల సక్సెస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. నాని సినిమాలు శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడవుతున్నాయి.ఈ సినిమాలో నానితో బిందుమాధవి, హరిప్రియ జోడి కట్టారు. ఈ మూవీలో సింధు పాత్రలో హరిప్రియ నటించి ఆకట్టుకున్నది. ఈ చిన్నది తక్కువ సినిమాలే చేసినా కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తకిట తకిట పిల్లజమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట , ఈ వర్షం సాక్షిగా, జైసింహా తదితర సినిమాల్లో నటించించి మెప్పించింది.హరిప్రియ హీరోయిన్ మాత్రమే కాదు భరతనాట్య కళాకారిణి కూడా. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తున్నది. జై సింహ సినిమా తర్వాత మరే సినిమా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఎంతో మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హరిప్రియ ఫోటోలు సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Hariprriya Simha (@iamhariprriya)

ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ మరియు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
Join WhatsApp Group Join Now