LPG Cylinder Price: ప్రతినెల తొలి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు జరుగుతాయి. అయితే ఈసారి కూడా జూలై 1వ తేదీన చుమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం 19 కేజీల సిలిండర్ పై రూ. 58.50 ధర తగ్గింది. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1665 గా ఉంది. ఈ కొత్త రేట్లు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి. చమరు కంపెనీలు ఈ నెలలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఒక మంచి శుభవార్త తెలిపాయి. ఈ నెలలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ముఖ్యంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు డొమెస్టిక్ సిలిండర్లను ఉపయోగించే వారికి కాకుండా కమర్షియల్ సిలిండర్ ఉపయోగించేవారికి భారీ ఊరట కలిగిస్తాయి.
ఈరోజు నుంచి కమర్షియల్ ఎల్పీజీ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 58.50 తగ్గింది. జులై 1వ తేదీ నుంచి ఢిల్లీ మార్కెట్లో 19 కిలోల వాణిజయ ఎల్పిజి గ్యాస్ సిలి సిలిండర్ రిటైర్ ధర రూ. 1665. కానీ14.2 కిలోల గృహ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు జరగలేదు అని గుర్తించగలరు. గత కొన్ని రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతున్నాయి. చమరు కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గత నాలుగు నెలల నుంచి భారీ ఊరట ఇస్తున్నాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇతర నగరాలలో కూడా దిగి వచ్చాయి. వాణిజ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కోల్కత్తా నగరంలో ఈరోజు రూ. 1826 నుండి రూ. 1767.50కు తగ్గినట్లు తెలుస్తుంది. ముంబైలో కూడా ఈరోజు కొత్త ధర రూ. 1616 గా ఉంది. ఈ ధర నిన్నటి వరకు రూ.1674.50 గా ఉండేది. వాణిజ్య సిలిండర్ ధర చెన్నై నగరంలో కూడా ఈరోజు రూ.1881 నుంచి రూ. 1822.50కు తగ్గినట్లు సమాచారం.