
Gold and Silver Prices Today: సామాన్యులకు అందనంత వేగంగా ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలలో పెరుగుదల కనిపిస్తుంది. బంగారం మరియు వెండి లోహాలు రెండు కూడా రోజురోజుకు పోటీపడుతూ పెరుగుతున్నాయి. ఒకరోజు ఈ ధరలలో తగ్గుదల కనిపిస్తే మరుసటి రోజు అంతకు రెట్టింపు ధర పెరుగుతున్నాయి.
దీంతో ఈ రెండు లోహాలు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారిలో ఆందోళన పెరుగుతుంది. ఇక బంగారం ధర ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని ఆల్టైమ్ హై రికార్డుకు చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి బంగారం మరియు వెండి ధరలలో తగ్గుదల కనిపించినప్పటికీ రెండు మూడు రోజుల నుంచి ఈ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,50,000 కు చేరువలో ఉంది. ఈరోజు జనవరి 15 బంగారం మరియు వెండి ధరలు దేశీయ మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,010 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఈరోజు రూ.1,32,010 గా ఉంది. బంగారం కంటే వెండి ధరలు రెట్టింపు వేగంలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు బంగారం కంటే కూడా వేగంగా పెరుగుతున్నాయి. మన దేశ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,90,100 గా ఉంది.






