Gold Price Today: గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం మరియు వెండి ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నాయి. దీంతో ప్రస్తుతం పెట్టుబడిదారుల దృష్టి మొత్తం ఈ రెండు లోహాల మీదనే ఉంది. 2026 జనవరి నెల మొదటి రెండు వారాలలోనే బంగారం మరియు వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగి కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజి ప్రకారం 10 గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలకు చేరుకోగా వెండి ధర కిలోకు రు.2.60 లక్షలకు చేరుకుంది.
ఇటువంటి సమయంలో బంగారం లేదా వెండి కొనడం రిస్కేనా ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో వీటి ధరలు పెరగడానికి అతిపెద్ద కారణం ప్రపంచంలో పెరుగుతున్న ఉదృత్తులు అని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, వెనిజులా, ఇరాన్, జపాన్, చైనా వంటి దేశాలు సంఘటనలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో భయాన్ని మరియు అనిస్థితి ని పెంచుతున్నాయి.
Aslo Read: ఇంటి రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఏం జరుగుతుందో తెలుసా..!
ఇప్పుడు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచ ఉద్రిక్తతలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టే సూచనలు లేకపోవడంతో కమోడిటీ నిపుణుడు మనిషి శర్మ వీటి గురించి మాట్లాడుతూ రానున్న భవిష్యత్తులో బంగారం మరియు వెండి ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం వీటి మీద పెట్టుబడి పెట్టిన వారు ఉపసంహరించుకోవడానికి బదులుగా వాటి లాభాలలో 40 లేదా 50 శాతం బుక్ చేసుకోవడం చాలా తెలివైన పని అని ఆయన సూచిస్తున్నారు.







