Home Loan EMI: ఈ మధ్యకాలంలో చాలామంది బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందుతున్నారు. కొత్త ఇంటి కలను సాకారం చేసుకోవాలంటే గృహ రుణం బ్యాంకుల నుంచి తీసుకోవాల్సిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపాదించే డబ్బుతో ఇల్లు కట్టుకోవడం లేదా కొనడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కానీ విషయం. కొంతమంది గురుహరణం తీసుకున్న తర్వాత ఉపాధిని కోల్పోవడం లేదా ఆరోగ్య సమస్యలు ఇతర ఇతర కారణాల వలన తీసుకున్న రుణాన్ని చెల్లించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా వాయిదాలు చెల్లించకపోవడం వలన వడ్డీ పెరిగి ఆ తర్వాత అది ఒక పెద్ద గుడిబండ లాగా భారంగా మారుతుంది.
తిరిగి చెల్లించలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి సమయాలలో బ్యాంకులో తమ వద్ద తీసుకున్నారు రుణాన్ని ఎలా వసూలు చేసుకుంటాయి అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. సాధారణంగా అయితే గృహ రుణం తీసుకున్న తర్వాత ఏవో కొన్ని ఇబ్బందుల కారణంగా ఒకటి లేదా రెండు సార్లు వాయిదాలను చెల్లించడం ఆలస్యం అవుతుంది. ఈ విధంగా వాయిదా చెల్లించని సమయంలో బ్యాంకుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది. ఒకవేళ వరుసగా మీరు మూడు నెలలు వాయిదా చెల్లించడంలో ఆలస్యం చేసినట్లయితే మీకు బ్యాంకుల నుంచి హెచ్చరికలు తప్పవు.
Also Read: బంగారంపై భారీగా లోన్ పొందాలి అనుకుంటున్నారా…ఆర్.బి.ఐ కొత్త రూల్స్ తెలుసుకోండి
అటువంటి సమయంలో బ్యాంకులో వెంటనే అప్రమత్తమయ్యి మీరు తీసుకున్న రుణాన్ని నిరర్థక ఆస్తిగా గుర్తిస్తారు. ఈ విధంగా బ్యాంకులు నోటీసులు పంపిన తర్వాత కూడా మీరు స్పందించక పోతే మిమ్మల్ని వారు దివాలాదారుగా గుర్తించి మీ ఇంటికి నోటీసులను పంపిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది. ఇటువంటి సమయంలో మీరు తీసుకున్న రుణాన్ని మీరు చెల్లించ లేరు అని బ్యాంకు గుర్తించినట్లయితే బ్యాంకు మీ మీద తదుపరి చర్యలకు రెడీ అవుతుంది. సర్ఫేసి చట్టం ప్రకారం 60 రోజుల గడువు ముగిసిన తర్వాత బ్యాంకు తుది నోటీసును ఇంటికి పంపిస్తుంది. ఇటువంటి సమయంలో మీకు రుణమిచ్చిన సంస్థ మీ ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.







