Post Office RD Scheme: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించిన రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు. సామాన్యులకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే రిస్క్ అని చెప్పాలి. అలాగే ప్రైవేట్ చిట్టి ల మీద కూడా చాలామందికి నమ్మకం ఉండదు. కానీ సామాన్యుల కోసం ఇప్పటివరకు పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో మంచి పథకాలు అమలులో ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు చాలామంది కష్టపడి సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ లో ఒక మంచి పథకం అమలులో ఉంది.
ప్రభుత్వ హామీతో ఉండే పోస్ట్ ఆఫీస్ పథకాలలో డబ్బులను పెట్టుబడి పెట్టడం 100% సేఫ్ అని చెప్పొచ్చు. ఈ పథకంలో మీరు ప్రతిరోజు కేవలం రూ.200 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే కొన్ని ఏళ్ల తర్వాత మీరు రూ.10 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీసర్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అంటారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకం ఉంటుంది కాబట్టి దీనిలో మీకు 100% సేఫ్టీ ఉంటుంది. మార్కెట్లో ఉండే ఒడిదుడుకులతో ఈ పథకానికి సంబంధం ఉండదు.
Aslo Read: సంక్రాంతి రోజున పసిడి ప్రియులకు షాక్ – ఆల్ టైమ్ హైకి బంగారం, వెండి ధరలు
మీరు కట్టిన మొత్తం డబ్బులకు మీకు ఖచ్చితమైన వడ్డీ జమ చేయబడుతుంది. ఈ పథకంలో మీరు చేరాలంటే పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం మీరు 100 రూపాయలతో కూడా ఈ పథకంలో ఎకౌంటు తెరవచ్చు. సామాన్యులకు ఈ పథకం అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఈ పథకానికి మీకు 6.7% వార్షిక వడ్డీ రేటు ఉంటుంది. ఈ పథకానికి మీకు ఒక అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే ఈ పథకంలో మీకు కాంపౌంటింగ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ ఉంటుంది. అంటే మీకు వచ్చే వడ్డీ మీద కూడా వడ్డీ జమ అవుతూ మీ డబ్బులు స్పీడ్ గా పెరుగుతాయి. మూడు నెలలకు ఒకసారి మీ వడ్డీ మొత్తాన్ని లెక్కించి మొత్తం డబ్బులను మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది.







