Lizard Falling on Head: ప్రతి ఇంట్లో కూడా బల్లి కనిపించడం అనేది సర్వసాధారణం. అయితే బల్లుల గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తలమీద లేదా నెత్తిమీద బల్లి పడినట్లయితే ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని చాలామంది భయపడతారు. నిజంగానే తలమీద లేదా నెత్తి మీద బల్లి పడినట్లయితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన శకున శాస్త్రం ప్రకారం బల్లి మీద పడినట్లయితే దానిని ఒక శకునంగా అందరు భావిస్తారు.
అయితే శరీరంలో ఉన్న భాగాల మీద బల్లి పడిన దానినిబట్టి కలిగే ఫలితాలు ఉంటాయని చాలామంది నమ్మకం. తల మీద బల్లి పడినట్లయితే శకుని శాస్త్రం ప్రకారం మానసిక ఆందోళన అపవాదం వంటివి పడే అవకాశం ఉందని చెప్తారు. తల మీద లేదా నెత్తిమీద బలిపడడాన్ని చాలామంది ప్రమాద సూచనగా కూడా భావిస్తారు. అయితే పూర్తిగా ఇది వారి వారి నమ్మకం పై ఆధారపడి ఉంటుంది.
Aslo Read: వాస్తు ప్రకారం ఆగిపోయిన లేదా విరిగిపోయిన వాచ్ చేతికి ధరిస్తే జరిగే నష్టాలు ఇవే
శాస్త్రపరంగా చెప్పుకున్నట్లయితే బల్లి పడటం అనేది ఒక అనుకోకుండా జరిగే సంఘటన మాత్రమే. ఇంట్లో తలుపుల దగ్గర ఫ్యాన్ల దగ్గర ఉండే బల్లులు అనుకోకుండా మీద పడతాయి. అయితే ఇది భవిష్యత్తుకు ప్రమాద సంకేతం కాదని వైద్యులు మరియు శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్తున్నారు. అయితే చిన్నప్పటినుంచి బల్లుల గురించి చాలా కథనాలు వినడం వలన అవి మీద పడినట్లయితే మీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అనే ఆందోళన కలుగుతుంది.







