Business Idea: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వ్యాపారాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యాపారం చాలా అద్భుతమైన వ్యాపారం అని చెప్పడంలో సందేహం లేదు. ఈ వ్యాపారంలో మీరు ప్రతిరోజు కూడా 5000 రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు. సృజనాత్మకమైన వ్యాపారాలలో పువ్వుల వ్యాపారం కూడా ఒకటి. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం అని చెప్పడంలో సందేహం లేదు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పుట్టినరోజులు ఇలా సందర్భం ఏమైనా కూడా ఇంట్లో అలంకరణ కోసం పువ్వులకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. లోకల్ 18న తాజాగా రకరకాల పువ్వుల వ్యాపారం చేస్తూ ప్రతిరోజు 5000 రూపాయల సంపాదిస్తున్న వ్యాపారస్తుడు విశ్వనాథుతో ప్రత్యేకంగా కథనం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం మారుతి నా కాలంలో సాగు విధానంలో కూడా చాలా మార్పులు జరిగాయి. పూలు మరియు పండ్ల తోటలను పెంచే రైతులు కూడా నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఈ మధ్యకాలంలో నూతన సాంకేతిక విధానంతో నర్సరీలో ఉండే మొక్కలు కూడా అభివృద్ధి పరిచి రకరకాల మొక్కలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి నర్సరీలో చాలామందికి ఉపాధిగా ఉన్నాయి. కదిరికి చెందిన విశ్వనాథ్ అనే ఒక వ్యాపారస్తుడు ఆర్ అండ్ బి బంగ్లా రోడ్డు పక్కన ఒక నర్సరీలో ఇండోర్ మరియు అవుట్ డోర్ మొక్కలను సాగు చేస్తూ ప్రతిరోజు వేలలో లాభాలను పొందుతున్నాడు.
మంచి జాతి మొక్కలపై తోట సాగు ఆధారపడి ఉంటుంది. అలాగే పంట దిగుబడి దాని నాణ్యత నారు మొక్కలపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ తొలి ఏడాదిలో ఏమైనా తప్పు జరిగినట్లయితే ఆ తర్వాత దానిని సరి చూసుకోవడం కూడా కుదరదు. ఈ క్రమంలో చాలామంది రైతులు ప్రస్తుతం నర్సరీల పైన ఆధారపడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నర్సరీలు కూడా చాలానే వెలిశాయి. నర్సరీలో మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు కావాల్సిన మొక్కలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కదిరికి చెందిన విశ్వనాధ్ అనే వ్యక్తి ఇండోర్ మరియు ఔటర్ మొక్కలను సాగు చేస్తూ వాటిని రైతులకు అందిస్తున్నాడు. ఇక్కడ ఒక మొక్క 120 రూపాయలు ధర ఉంటుంది.