Oosaravelli: ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ విజయం తర్వాత దేవర సినిమాతో మరొక భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్.ఆరేళ్ళ తర్వాత సోలో గా దేవర సినిమాలో ఎన్టీఆర్ నటించడం జరిగింది.ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఊసరవెల్లి సినిమా కూడా ఒకటి.ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.
ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి.అలాగే ఈ సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి కూడా అందరికి బాగా గుర్తుండే ఉంటుంది.ఈమె పేరు పాయల్ ఘోష్.ఊసరవెల్లి సినిమాలో ఈమె హీరోయిన్ ఫ్రెండ్ గా మంచి నటన కనపరిచింది.
అయితే ఈమె మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత ఈమె తెలుగు లో పలు సినిమాలలో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పచ్చు.సోషల్ మీడియాలో మాత్రం పాయల్ చాల ఆక్టివ్ గా ఉంటుంది.అప్పట్లో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న ఈమె ప్రస్తుత లుక్స్ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram