Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి,ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పుష్ప ది రైజ్ చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ దర్శకత్వంలో పుష్ప రెండవ భాగంలో నటిస్తున్నారు.అయితే అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాల సినిమాలలో నటించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే అల్లు అర్జున్ బాల నటుడిగా రెండు సినిమాలలో నటించిన సంగతి చాల మందికి తెలియక పోవచ్చు.
తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు,ఎన్టీఆర్ (NTR) ,తరుణ్ బాల నటుడిగా చాల సినిమాలలో నటించారు.మహేష్ బాబు (Mahesh Babu) తన తండ్రి అయినా సూపర్ స్టార్ కృష్ణ గారి చాల సినిమాలలో బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక హీరో తరుణ్ దాదాపుగా ఇరవై కు పైగా సినిమాలలో బాల నటుడిగా నటించి మెప్పించారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బ్రహ్మర్షి విశ్వామిత్ర,బాల రామాయణం వంటి చిత్రాలలో బాల నటుడిగా అందరిని మెప్పించారు.అయితే అల్లు అర్జున్ కూడా చిరంజీవి హీరోగా వచ్చిన విజేత మరియు కమల్ హాసన్ హీరోగా వచ్చిన స్వాతి ముత్యం అనే చిత్రాలలో బాల నటుడిగా నటించారు.కమల్ హాసన్ స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ కు మనవడిగా నటించారు అల్లు అర్జున్.అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ చిత్రం అనేక రికార్డులు సొంతం చేసుకుంది.చిరంజీవి హీరోగా వచ్చిన డాడీ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించారు అల్లు అర్జున్.