Anjala Zaveri: అంజలా జవేరి భర్త మనకు బాగా తెలిసిన టాలీవుడ్ నటుడు…చూస్తే షాక్ అవుతారు

Anjala Zaveri
Anjala Zaveri

Anjala Zaveri: ‘అంజలా జవేరి’ సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో దాదాపు టాప్ హీరోలు అందరితో నటించి మెప్పించారామె. చిరంజీవితో కలిసి ‘చూడాలని ఉంది’. బాలకృష్ణతో ‘సమరసింహా రెడ్డి’, వెంకటేశ్ తో ‘ప్రేమించుకుందాం రా’ నాగార్జునతో ‘రావోయి చందమామ’తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంజలా జవేరి.

ఇలా ఫస్ట్ ఇన్నింగ్స్ లో మురిపించిన అందాల తార సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో కూడా నటించి మెప్పించారు.ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. అంజలా జవేరి భర్త ఎవరు.. ఎలా ఉంటారు.. ఏం చేస్తుంటాడనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన కూడా మంచి గుర్తింపు ఉన్న నటుడే. టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో యాక్ట్ చేశారు.

ఎక్కువ సినిమాల్లో విలన్ గా నటించారు అతనే తరుణ్ అరోరా. స్టైల్ గా, మోడ్రన్ విలన్ గా కనిపిస్తారు ఆయన. ఆయనే అంజా జవేరి భర్త అన్న విషయం చాలా మందికి తెలియదు.తరుణ్ అరోరా మంచి మంచి హిట్ సినిమాల్లో విలన్ గా మెప్పించారు. ఖైదీ నెంబర్ 150 లో విలన్ గా కనిపించాడు. జయ జానకీ నాయకా, కాటమ రాయుడు, అర్జున్ సురవరం, తదితర చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు తరుణ్ అరోరా.

అంజలా జవేరి ఈయనను ప్రేమించి పెండ్లి చేసుకున్నారట. వీరికి వివాహమై దాదాపు ఆరేళ్లు అయ్యింది. వీరికి పిల్లలు లేరట.. ఒకరికి ఒకరం పిల్లలం అంటూ కొంత ఆవేదన చెందుతుంటారట. ఈ విషయాన్ని తరుణ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. ఇద్దరూ మంచి నటులు కావడంతో అవకాశాలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)