Brahmanandam Family: ఇప్పటి వరకు ఎవరు చూడని హాస్యనటుడు బ్రహ్మనందం ఫ్యామిలీ ఫోటోలు వైరల్

Brahmanandam Family: టాలీవుడ్ లో ఎన్నో వందల సినిమాలలో నటించి తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నటించిన ప్రముఖ హాస్య నటుడు బ్రమ్మానందం.ఈయన గురించి ప్రేక్షకులకు యెంత చెప్పిన తక్కువే.తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు బ్రమ్మానందం.ఇప్పటికి కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

అయితే ప్రస్తుతం సినిమాలను తగ్గించిన బ్రమ్మానందం గారు తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతోనే గడుపుతున్నారు.తనకు ఎంతగానో ఇష్టమైన ఆర్ట్స్ వేస్తూ వాటిని కానుకగా ఇతరులకు అందజేస్తున్నారు బ్రమ్మానందం.ఇటీవలే బ్రహ్మనందం తన ఆత్మ కథను రాసిన సంగతి అందరికి తెలిసిందే.నేను మీ బ్రహ్మనందం అనే పేరుతొ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ పుస్తకానికి పుస్తకావిష్కరం కార్యక్రమం జరిగింది.

బ్రహ్మనందం తానూ పుట్టినప్పటి నుంచి తన జీవితం లో ఎదురుకొన్న ఇబ్బందులను,తను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం,తన భార్య పిల్లలు ఇలా అన్నిటి గురించి బ్రహ్మనందం ఈ పుస్తకంలో రాయడం జరిగింది.సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు బ్రహ్మనందం తెలుగు లెక్టరర్ గా పనిచేసే వారట.దాంతో ఈయనకు తన ఆత్మకథను రాసుకోవడం సులభతరంగా మారింది.బ్రహ్మనందం తన పెళ్లి గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను ఈ పుస్తకంలో రాయడం జరిగింది.

అప్పట్లో బ్రహ్మనందం తల్లితండ్రులు బ్రహ్మనందం కు పెళ్లి చేయాలనీ భావిస్తున్న సమయంలో తన చదువుకు ఎంతో సహాయం చేసినటువంటి మహిళా తెచ్చిన పెళ్లి సంబంధాన్ని చేసుకోవాలని బ్రహ్మనందం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.బ్రహ్మనందం ఫ్యామిలీ బ్రాహ్మణుల కుటుంబం.ఇక ఆ మహిళా తెచ్చిన లక్ష్మి ఫ్యామిలీ కాపుల కుటుంబం కావడంతో బ్రహ్మనందం ఫ్యామిలీ మొదట ఒప్పుకోలేదట.ఇక బ్రహ్మనందం పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పడంతో పెద్దలు కూడా ఒప్పుకొని వీరి పెళ్లి చేసారు.ఈ విషయాలను బ్రహ్మనందం తన ఆత్మ కథలో రాసుకొచ్చారు.

Leave a Comment