Chandramukhi Movie: చంద్రముఖి సినిమాలోని రామచంద్ర సిద్ధాంతి భార్య కూడా మనకు బాగా తెలిసిన స్టార్ నటి…ఆమె మరెవరో కాదు..!

Chandramukhi Movie
Chandramukhi Movie

Chandramukhi Movie: రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో చంద్రముఖి సినిమా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2005 లో రిలీజ్ అయ్యి భారీ విజయం సాధించింది.ఈ సినిమాలో జ్యోతిక ,నయనతార,ప్రభు,నాజర్,వడివేలు తదితరులు ముఖ్య పాత్రలో నటించారు.ఇప్పటికి ఈ సినిమా టీవిలో వస్తే చాల మంది ఇష్టంగా చూస్తారు.ఈ హారర్ సినిమాలో ప్రతి పాత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది.

ఈ సినిమాలో రజనీకాంత్ కు సహాయ పడే రామచంద్ర సిద్ధాంతి పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.ఈ పాత్రకు ఫస్ట్ హాఫ్ లో ఎక్కువగా కనిపించకపోయినా సెకండ్ హాఫ్ లో ఈ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంది.రామచంద్ర సిద్ధాంతి పాత్రలో నటించిన నటుడు పేరు అవినాష్.

Chandramukhi Movie
Chandramukhi Movie

అయితే అవినాష్ భార్య కూడా ఒక ప్రముఖ నటి అనే సంగతి చాల మందికి తెలియదు.ఈమె కన్నడ మరియు తమిళ్ సినిమాలలో ఎక్కువగా నటించారు.అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం.ఈమె మరెవరో కాదు కెజిఎఫ్ సినిమాలో రిపోర్ట్రర్ గా డైనమిక్ పాత్ర లో కనిపించిన నటి మాళవిక.కన్నడ,తమిళ్ లో ఈమె స్టార్ నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈమె రాజకీయాలలో కూడా బాగా రాణిస్తున్నారు.మాళవిక అవినాష్ కర్ణాటకలో బిజెపి అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.