Bhamane Satyabhaman Child Artist: ఏ పాత్రను అయినా సరే చాల సులభంగా చేసే గొప్ప నటులలో కమల్ హాసన్ కూడా ఒకరు.ఈయన హీరోగానే కాకుండా దర్శకుడు,రచయితా,సంగీతం వంటి విభాగాలలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ నిర్విరామంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.అన్ని భాషలో సినిమాలు చేసి క్రేజ్ సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోలలో ఈయన కూడా ఒకరు.కమల్ హాసన్ తెలుగులో పలు సినిమాలలో నటించడం జరిగింది.అలాగే ఈయన తమిళ్ లో చేసిన కొన్ని సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
ఇలా తెలుగులో డబ్ అయినా సినిమాలలో భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్ డిఫరెంట్ పాత్రలో కనిపించడం జరిగింది.తన కూతురి కోసం బామ్మా వేషంలో కమల్ హాసన్ తన మామగారి ఇంట్లో వెళ్లారు.కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.420 పేరుతొ ఈ సినిమాను కమల్ హాసన్ దర్శకత్వం వహించి హిందీలో నటించారు.తమిళ్,తెలుగు తో పాటు ఈ సినిమా హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఈ సినిమాలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి పేరు ఆన్ అన్నా.అప్పట్లో ఈ సినిమాకు ఈ చిన్నారి తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును దక్కించుకుంది.హిందీలో ఈ చిన్నారి హేరా ఫెరి సినిమాలో కూడా కనిపించింది.ఆ తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తుందని సమాచారం.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ తో కలిసి నటించడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఎంతో అందంగా ఉన్న ఈమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.