Drishyam Movie: ఇటీవల విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇక సంక్రాంతి పండుగకి రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ కూడా థియేటర్లలో ప్రదర్శించబడుతూ ఎన్నో కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పటివరకు వెంకటేష్ (Venkatesh) తన కెరియర్ లో నటించిన సినిమాలలో దృశ్యం సినిమా ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ విజయం సాధించింది.
మలయాళం లో మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమాకు తెలుగులో రీమేక్ చేశారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ లో వెంకటేష్ మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమాలో హీరో వెంకటేష్ కు ఇద్దరు కూతుర్లు ఉంటారు. తన కూతురి భవిష్యత్తు మరియు జీవితం కోసం ఒక తండ్రి పడే ఆరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో వెంకి పెద్ద కూతురుగా నటించిన అమ్మాయి పేరు కృతిక జయ కుమార్. ఈ ఒక్క సినిమాతోనే ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అయ్యింది.
కృతిక ఒక క్లాసికల్ డాన్సర్. దేశవ్యాప్తంగా ఈమె పలుషోలలో పాల్గొంది. తెలుగులో దృశ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతిక. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా కాకుండా సహాయ నటిగా నటించింది. వినవయ్య రామయ్య, రోజులు మారాయి, ఇంట్లో దయ్యం నాకేం భయం వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా కృతిగా అంతగా యాక్టివ్ గా ఉండదు. తాజాగా కృతిక కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram