Tollywood: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినీ సెలెబ్రెటీల అరుదైన ఫోటోలు ప్రతి రోజు వైరల్ అవుతూనే ఉన్నాయి.నటి నటుల చిన్ననాటి ఫోటోల నుంచి వారి సినిమా షూటింగ్ కి సంబంధించిన రేర్ పిక్స్ అన్ని కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రతి రోజు కనిపిస్తున్నాయి.ఇక ఇలాంటి రేర్ పిక్స్ ను చూడడానికి అభిమానులు కూడా చాల ఆసక్తిని చూపిస్తారు.ఎక్కువగా హీరోయిన్లకు సంబంధించిన రేర్ ఫోటోలు అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.ప్రస్తుతం ఇదే క్రమంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకే ఫ్రెమ్ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ లు ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్ ను ఏలారు.ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ లు ఎవరో కాదు నగ్మా,రమ్య కృష్ణ.అప్పట్లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే.అయితే పైన కనిపిస్తున్న ఫొటోలో వీరిద్దరి మధ్యలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.ఈ మధ్య కాలంలో ఆయన చాల ఫేమస్ అయ్యారు.ఆయన మరెవరో కాదు సినిమా నటి నటులు ఎవరు ఎప్పుడు విడిపోతారు.. ఎవరు చనిపోతారు అంటూ వార్తల్లో నిలిచినా వేణు స్వామి.
ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.ముఖ్యం గా టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ కపుల్ నాగ చైతన్య,సమంత విడిపోతారు అని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు వేణు స్వామి.అలాగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది అనారోగ్యానికి గురవుతారు…కొందరు చనిపోతారు అని కూడా చెప్పుకొచ్చారు.కొంత మంది హీరోయిన్ లు వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే.వేణు స్వామి(venu swamy) ఎప్పటినుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.ఆయన సినిమా ఓపెనింగ్స్ కు పూజలు చేసిన ఫోటోలు నెట్టింట్లో చాలానే వైరల్ అవుతూ ఉంటాయి.