Kamna Jethmalani: సిల్వర్ స్ర్కీన్ మీద హీరోయిన్ల డ్యురేషన్ తక్కువనే చెప్పాలి. రోజుకో హీరోయిన్ తెరపై తళుక్కున మెరుస్తుంటుంది. ఇందులో స్టాండ్ అయ్యేది కొందరు మాత్రమే. ఇందులో కొందరికీ సక్సెస్ లు ఉన్నా అవకాశాలు అంతగా రాక, వచ్చిన వాటిని సద్వినియోగం లేక తెరమరుగవుతుంటారు. మరికొందరు కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని మూవీస్ గుడ్ బై చెప్పేస్తుంటారు. ఇక పెళ్లయి పిల్లలు పుట్టాక ఇక కెరీర్ కు పుల్ స్టాప్ పడినట్లే..
సౌత్ సినిమాలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కామ్నా జెఠ్మలానీ. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన స్ర్కీన్ షేర్ చేసుకుంది. 2005లో ప్రేమికులు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది కామ్నా. ఆ తర్వాత రణం సినిమాలో గోపిచంద్ తో కలిసి నటించింది. ఈ సినిమా సక్సెస్ కామ్నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళ్ లో బోలెడు అవకాశాలు వచ్చాయి.
టాలీవుడ్ లో సామాన్యుడు, బెండు అప్పారావు ఆర్ఎంపీ, టాస్, అందమైన అబద్ధం, కింగ్, కత్తి కాంతారావు, యాక్షన్ 3 డీ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాలో చివరిసారిగా కనిపించింది. అదే సమయంల తమిళం, కన్నడలోనూ పలు సినిమాలు చేసింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్ పై దృష్టి సారించింది. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి కూడా దూరంగానే ఉంది. అయితే కామ్నా కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన కుటుంబంతో కలిసి ఉన్న చిత్రాలను షేర్ చేస్తూ వస్తున్నది. కొన్ని పాటలకు స్టెప్స్ వేస్తూ సందడి చేస్తుంటుంది. అయితే కామ్నా తన భర్త వ్యాపారాలను కూడా డీల్ చేస్తు్న్నది. వీరిప్పుడు బెంగుళూరులోనే ఉంటున్నట్లు సమాచారం. తాజాగా కామ్నా తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫొటో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది.
ఇటీవల మదర్స్ డే సందర్భంగా తన కూతుళ్లతో కలిసి ఉన్న ఫోటోలను కామ్నా. షేర్ చేసింది. ఇందులో ఇద్దరు చిన్నారులు ఎంతో ముద్దుగా ఉన్నారు. అందంలో అచ్చు తల్లి లాగే కనిపిస్తున్నారు. తన కూతుళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని, హద్దులు లేని ప్రేమ, సహనం.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతూ ఆనందంగా ఉండాలని తన పిల్లలను చూసి నేర్చుకున్నట్లు కామ్నా గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు కామ్నా ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. బ్యూటీఫుల్ మమ్మీ.. క్యూట్ చిల్డ్రన్స్ అంటూ నెటిజన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
View this post on Instagram