Reema Sen Family: వి యెన్ ఆదిత్య దర్శకత్వం లో వచ్చిన మనసంతా నువ్వే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.2001 లో రిలీజ్ అయినా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్,రీమా సేన్ హీరో హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో తన అందంతో నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది రీమా సేన్.ఇక అదే సంవత్సరం రీమాసేన్ తమిళ్ లో మిన్నేలే అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.ఇలా రీమాసేన్ తెలుగు తో పాటు తమిళ్,కన్నడ,మలయాళంలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది.
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేని ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ సినిమాలలో ఉదయ్ కిరణ్,రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమా కూడా ఒకటి.2001 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.1981 లో కల్ కత్తా లో జన్మించినా రీమాసేన్ ఆ తర్వాత నటన మీద ఆసక్తి తో మోడలింగ్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది.అలా పలు యాడ్స్ లోను నటించింది రీమాసేన్.
తెలుగు,తమిళ్,కన్నడ,హిందీ వంటి భాషలలో పలు సినిమాలలో నటించిన మంచి గుర్తింపును సంపాదించుకుంది.బిజినెస్ మ్యాన్ అయినా శివ కిరణ్ సింగ్ ను 2012 లో పెళ్లి చేసుకుంది.తన ఫ్యామిలీతో కలిసి రీమాసేన్ ముంబై లో ఉంటున్నట్లు సమాచారం.ఇక పెళ్లి తర్వాత పూర్తి గా సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తి సమయాన్ని రీమాసేన్ తన ఫ్యామిలీకి కేటాయించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ దంపతులకు రుద్రవీర్ అనే కొడుకు కూడా ఉన్నాడు.రీమాసేన్ సోషల్ మీడియా ప్లేట్ ఫారం లలో కూడా ఆక్టివ్ గా ఉండరు.కానీ ఎప్పుడో ఒకసారి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా రీమాసేన్ షేర్ చేసిన కొన్ని ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.