Hari Hara Veera Mallu: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. దీనిలో భాగంగా సినిమా యూనిట్ ఇటీవలే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాడిన మొదటి పాట మాట వినాలి రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్ లో ఈ పాట మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతుంది.
పవన్ పాడేటప్పుడు తీసిన వీడియోను తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ మాట వినాలి బి టి ఎస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోలో పవన్ ఎంతో ఉత్సాహంగా, జోష్తో పాటను పాడారు. ఇక ఈ పాట చిత్రీకరణ ఎంతో సరదా వాతావరణం లో జరిగినట్లు తెలుస్తుంది.
క్రిష్ జాగర్లమూడి మొదట్లో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సగభాగం షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్ని కారణాల వలన ఆయన తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ సినిమాను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఏ ఏం రత్నం సూర్య మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.