Pasivadi Pranam: పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..ఇప్పుడు ఎలా ఉందో..ఏం చేస్తుందో తెలుసా!

Pasivadi Pranam
Pasivadi Pranam

Pasivadi Pranam: చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమాలు అప్పట్లో ఒక సంచలనం అని చెప్పచ్చు.చిరంజీవి నటించిన చాల సినిమా కథలు, ఆ సినిమాలోని పాత్రలు అన్ని కూడా ప్రేక్షకులకు ఇప్పటికి కూడా గుర్తుండిపోతాయి.అలా ప్రేక్షకులకు ఇప్పటికి బాగా గుర్తుండిపోయే సినిమాలలో పసివాడి ప్రాణం సినిమా కూడా ఒకటి.చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో పసివాడి ప్రాణం సినిమా కూడా ఒకటి.

అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా.ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఆయన తో కలిసి నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కి కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు వచ్చింది.ఈ చిత్రంలో అబ్బాయి పాత్రలో కనిపించింది ఒక అమ్మాయి.ఆ అమ్మాయి పేరు సుజాత.ఈమె జై చిరంజీవ సినిమా లో హీరో చిరంజీవి కి చెల్లెలిగా కూడా నటించారు.అయిదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నటన పరంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది సుజాత.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి సినిమాలతో పాటు ఈమె బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున సినిమాలలో కూడా నటించడం జరిగింది.ఒక ఇంటర్వ్యూలో సుజాత పసివాడి ప్రాణం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.అయిదు భాషలలో పసివాడి ప్రాణం సినిమా వస్తే మొత్తం తానె చేసినట్టు తెలిపారు సుజాత.ఇక సుజాత బుల్లితెర మీద పలు సీరియల్స్ కూడా నటిస్తున్నారు.ఇక సినిమాలలో హీరోలకు అక్క,చెల్లి,వదిన వంటి పాత్రలు కూడా చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)