Shankar Dada M.B.B.S: ఇంద్ర,ఠాగూర్,అంజి వంటి సీరియస్ కంటెంట్ ఉన్న సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూర్తి స్థాయిలో వినోదభరితంగా చేసిన చిత్రం శంకర్ దాదా ఎంబీబీస్.అప్పట్లో రిలీజ్ అయినా ఈ చిత్రం సెన్సషనల్ హిట్ తో పాటు అల్ టైం టాప్ 3 చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది.ఈ చిత్రంలో మెగా స్టార్ కామెడీ టైమింగ్ కి అందరు ఫిదా అవ్వాల్సిందే.ఈ చిత్రంలో చిరంజీవి తో పాటు ఆయన తమ్ముడిగా నటించిన ఏటీఎం పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది.తెలుగు ప్రేక్షకులు ఇప్పటివరకు ATM గా శ్రీకాంత్ పాత్ర గుర్తుండిపోతుంది.
ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో కూడా ATM గా శ్రీకాంత్ గారే నటించడం జరిగింది.ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీకాంత్ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఈ చిత్రంలో ATM పాత్రను చిరంజీవి గారు ముందుగా పవన్ కళ్యాణ్ గారితో చేయిద్దాం అని అనుకున్నారు.కానీ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు కమిట్ అయి బిజీ గా ఉండడంతో పవన్ ఈ సినిమా చేయలేకపోయారు అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
అయితే ఒక రోజు నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లగా ఆయన నన్ను ఈ సినిమా చేస్తావా..అని అడిగినప్పుడు అది అదృష్టంలా భావించి ఆ సినిమా చేశాను అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.అఖండ సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్,ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు.