Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కన్నప్ప మూవీ మేకర్స్ కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. ఇక రుద్రుడిగా ప్రభాస్ (Prabhas) లుక్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. కన్నప్ప (Kannappa) సినిమా నుంచి ప్రళయ కాల రుద్రుడు, శివజ్ఞ పరిపాలకుడు, త్రికాల మార్గదర్శకుడు అంటూ ప్రభాస్ పవర్ఫుల్ పాత్రను రిలీజ్ చేశారు సినిమా యూనిట్.
ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మరియు వేషధారణ చూస్తుంటే దైవత్వం ఉట్టిపడుతుంది అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో ప్రభాస్ లుక్ ఉంటుందని ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండరు. ఇప్పటివరకు ఈ సినిమాపై అందరికీ ఉన్న అంచనాలు ప్రస్తుతం ఈ పోస్టర్తో తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. మైథాలజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాయి మాధవ్ బుర్ర, పరచూరి గోపాలకృష్ణ, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు కన్నప్ప సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమాను విజువల్స్ పరంగా, టెక్నికల్ పరంగా చాలా హై స్టాండర్డ్ లో రూపొందిస్తున్నారని సమాచారం.
ॐ The Mighty ‘Rudra’ ॐ
Unveiling Darling-Rebel Star 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 as ‘𝐑𝐮𝐝𝐫𝐚’ 🔱, a force of divine strength, wisdom, and protector in #Kannappa🏹. ✨
Embark on an extraordinary journey of devotion, sacrifice, and unwavering love.
Witness this epic saga on the big screen… pic.twitter.com/wcg7c3ulxd
— Kannappa The Movie (@kannappamovie) February 3, 2025