Premiste Movie: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రేమిస్తే మూవీ హీరోయిన్…లేటెస్ట్ పిక్స్ వైరల్.!

Premiste Movie: ప్రేమకథా చిత్రాల్లో తమిళ డబ్బింగ్ మూవీ ప్రేమిస్తే ట్రెండ్ సెట్టర్ గా నిలచింది. ఈ విషాద ప్రేమకథ సినిమా తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ నిర్మాణ సారథ్యంలో ఆయన శిష్యుడు బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కోలీవుడ్ నటుడు భరత్, సంధ్య హీరోహీరోయిన్లుగా నటించారు. 2004లో విడుదలైన సినిమాల్లో ఈ మూవీ ఆ ఏడాది సూపర్ హిట్ గా నిలిచింది. నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ విషాద ప్రేమకథ అప్పట్లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రంలోని పాటలు కూడా ట్రెండ్ సెట్ చేశాయి. యూట్యూబ్‏లో ఇప్పటికీ మంచి వ్యూస్ అందుకుంటున్నాయి.

ఈ సినిమాతోనే సంధ్య హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే అందం, అభియనంతో ఆకట్టుకున్నది సంధ్య. ప్రేమిస్తే సినిమా తర్వాత ఈ చిన్నదానికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతో సౌత్ ఇండస్ర్టీ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి.అయితే ప్రేమిస్తే తర్వాత హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేదు. స్కిన్ షో కు దూరంగా ఉండడంతో సపోర్టింగ్ రోల్స్ తో సరిపెట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలో పవన్ సోదరిగా కనిపించింది. వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో మెప్పించింది సంధ్య. కొన్నాళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. 2015లో చెన్నైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అర్జున్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

గురువాయూర్ దేవాలయంలో వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంధ్య కుటుంబానికే టైమ్ కేటాయించింది.2016లో వీరికి కూతురు జన్మించింది. ప్రస్తుతం సంధ్య తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంది సంధ్య. ఇటు సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. తాజాగా సంధ్యకు సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు.. అందం, అమాయకత్వం కలబోసి ఉన్న సంధ్య ఇప్పుడు గుర్తుపట్టడానికి వీలు లేనంతగా మారిపోయింది. అప్పటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఆమె అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

Leave a Comment