Mahesh Babu: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తుంది అని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే సినిమా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు ముందే రాజమౌళి ఈ సినిమాను ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతున్న ఇప్పటివరకు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh Babu) సినిమా సెట్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. చాలామంది పెద్దపెద్ద స్టార్లు ఈ సినిమాలో భాగం కానున్నారని తెలుస్తుంది.
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల అన్వేషణ జరుగుతుంది. అలాగే కొంతమందిని స్క్రీన్ టెస్ట్ కూడా చేసి ఎంపిక చేయడం జరిగింది. ఈ సినిమాలో నటించబోతున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయినా మరెవరో కాదు మలయాళంలో మంచి గుర్తింపుని తెచ్చుకున్న స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.
ఈయన మలయాళం తోపాటు తెలుగు తమిళ్ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా హాలీవుడ్ నటి నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమా ముహూర్తం నిర్వహించనున్నారు. ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. . 1000 కోట్ల అతి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా ను దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ తరహాలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం.