Chiranjeevi- Balakrishna: బాలకృష్ణ,చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…బాగా క్రేజ్ ఉన్న సెలెబ్రిటీ ఎవరో తెలుసా…!

Chiranjeevi- Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినా నందమూరి బాలకృష్ణ మరియు మెగా స్టార్ చిరంజీవి ఇద్దరి మధ్య నిలబడి ఉన్న ఒక చిన్నారి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అయితే ఈ మధ్య కాలంలో చాల మంది సెలెబ్రెటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.తాజాగా చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరి మధ్య నుంచొని ఉన్న చిన్నారిని గుర్తుపట్టడానికి నెటిజన్లు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారు.ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి ఉన్న ఈ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఫొటోలో ఉన్న చిన్నారి స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ అని సమాచారం.సినిమాను వ్యాపారంగా కాకుండా వ్యాపకంగా భావించే స్టార్ ప్రొడ్యూసర్ అశ్వని దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు.తండ్రి బాటలోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా నిలిచారు.

టాలీవుడ్ లో చిరంజీవి,పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్ సినిమాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు.రవితేజ,నాని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు అశ్వని దత్.బాంబే దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 2009 లో త్రి ఏంజెల్స్ స్టూడియో తో ఒక నిర్మాణ సంస్థ ను ప్రారంభించి కొత్త వాళ్ళను ప్రోత్సహించారు.బాణం,ఎవడే సుబ్రహ్మణ్యం,మహానటి వంటి మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలను నిర్మించారు.మెయిల్ అనే అద్భుతమైన ఓటిటీ చిత్రాన్ని కూడా నిర్మించారు ప్రియాంక దత్.జాతి రత్నాలు సినిమాకి సహా నిర్మాతగా కూడా పని చేసారు.

Leave a Comment