Rambha Daughter: అచ్చం రంభ లాగానే ఎంతో అందంగా ఉన్న రంభ కూతురు…తల్లికి జిరాక్స్ కాపీ..!

Rambha Daughter: తెలుగు సినిమా ప్రేక్షకులు విజయలక్ష్మి అంటే గుర్తుపట్టలేరు కానీ రంభ అంటే మాత్రం బాగా గుర్తుపట్టగలరు.ఒక్కప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో అభినయంతో బాగా రాణించింది రంభ.అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికి జోడిగా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రంభ.తెలుగుతో పాటు ఈమె తమిళ్,మలయాళం,కన్నడ ఇలా అన్ని భాషలలోను సినిమాలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

తెలుగులో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించింది.ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ అమ్మడు.కెరీర్ స్టార్ట్ అయినా అతి తక్కువ సమయంలోనే చిరంజీవి,నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.సినిమా అవకాశాలు తగ్గు ముఖం పట్టడంతో 2010 లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది.ఈమె కెనడా కు చెందిన బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది.

ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు ఉన్నారు.సినిమాలకు దూరమైనా కూడా ఈమె సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తన సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన పెద్ద కూతురు ఫోటోలను షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.రెండు జాడలు వేసుకొని,పాపిట బిళ్ళ,లంగా జాకెట్ వేసుకొని ముద్దుగా ఉన్న రంభ పెద్ద కూతురు లాన్య ఇటీవలే ఒక వేడుకలో పాల్గొనడం జరిగింది.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మేడం మీ కూతురు అచ్చం మీలాగే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rambha💕 (@rambhaindran_)

Leave a Comment