Harshaali Malhotra: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో భజరంగి భాయిజాన్ సినిమా ఒకటి.ఈ సినిమాలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న పాత్రలలో సల్మాన్ పాత్ర తర్వాత అందరికి బాగా గుర్తుండిపోయే పాత్ర మున్ని.హర్షాలీ మల్హోత్రా మున్ని పాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయ్యింది.ఇక ఈ సినిమాకు కథను స్టార్ డైరెక్టర్ తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు.కరీనా కపూర్,నవాజుద్దీన్ సిద్దికీ,శరత్ సక్సేనా తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు.
మున్ని పాత్రలో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యిన హర్షాలీ మల్హోత్రా జూన్ 3 2008 లో జన్మించింది.భజరంగి భాయిజాన్ సినిమా చేసే సమయంలో ఆమె వయస్సు ఏడు సంవత్సరాలు.ప్రస్తుతం హర్షాలీ మల్హోత్రా వయస్సు 15 సంవత్సరాలు.సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భజరంగి భాయిజాన్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ కు పరిచయం అయ్యింది హర్షాలీ.ఈ సినిమా తనకు మొదటి సినిమా అయినప్పటికీ పాకిస్తాన్ కు చెందిన మూగ బాలికగా హర్షాలీ మున్ని పాత్రలో అద్భుతంగా నటించింది.ఈ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ మున్ని పాత్ర ఇప్పటికి ప్రేక్షకులకు బాగా గుర్తుంది.అప్పట్లో ఈ సినిమాకు గాను హర్షాలీ కి రూ.3 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.
అయితే ఈ సినిమా తర్వాత హర్షాలీ మరి ఏ సినిమాలో కూడా నటించలేదు.అయితే సల్మాన్ తో హర్షాలీ ఇప్పటికి టచ్ ఉన్నానని చెప్పిందని సమాచారం.ప్రస్తుతం హర్షాలీ చదువుకుంటూ తనకు ఎంతో ఇష్టమైన సంగీతాన్ని నేర్చుకుంటుందని తెలుస్తుంది.ఇటీవలే తాజాగా హర్షాలీ మ్యూజిక్ క్లాస్ కి వెళ్లి వస్తూ కెమెరా ల కంట పడటంతో ఆమె ప్రస్తుతం ఎలా ఉంది అనేది అందరికి తెలుస్తుంది.హర్షాలీ లేటెస్ట్ ఫోటోలను వీడియొ ను చుసిన నెటిజన్లు హర్షాలీ అప్పుడే యెంత పెద్దది అయిపోయింది,ఇప్పటికి అలాగే ఉంది..నువ్వు ఎప్పటికి మా మున్నీవే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.