Childhood Pic: కృష్ణుడి గెటప్ లో ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టగలరా…!

Childhood Pic: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాధ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అగ్ర హీరోలు అయినా చిరంజీవి,బాలకృష్ణ కు జోడిగా నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రాధ.80 -90 స్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన చాల మంది హీరోయిన్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

అయితే వీళ్ళలో కొంత మంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి సక్సెస్ అవుతున్నారు.మరికొంత మంది స్టార్ హీరోయిన్లు తమ కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు.ఇలా తమ ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని ఇచ్చే హీరోయిన్లలో రాధ కూడా ఒకరు అని చెప్పచ్చు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి రాధ బెస్ట్ ఫ్రెండ్స్.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాల చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇప్పుడిప్పుడే ఒకప్పటి అందాల తార రాధ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు.ఒకప్పుడు ఈమె తెలుగుతో పాటు తమిళ్ మలయాళంలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించారు.హీరోయిన్ రాధ కూతురు కార్తీక కూడా నాగ చైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.అయితే తల్లి అందుకున్న స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది కార్తీక.వరుస అవకాశాలతో సినిమాలతో బిజీ గా ఉన్న సమయంలోనే రాధ తన సమీప బంధువు అయినా మని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన రాధ తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీకి కేటాయించారు అని తెలుస్తుంది.

Leave a Comment