Sunil Family: తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నువ్వే కావాలి చిత్రంతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.కమెడియన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత చాల సినిమాలలో కమెడియన్ గానే చేసారు.మొదటిసారిగా సునీల్ అందాల రాముడు అనే చిత్రంతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో సునీల్ కు జోడిగా ఆర్తి అగర్వాల్ నటించారు.ఆ తర్వాత జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రంలో సునీల్ హీరోగా చేసారు.ఈ చిత్రం సునీల్ కు మంచి విజయం సాధించి పెట్టింది.
ప్రస్తుతం సునీల్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు విలన్ గా కూడా చేస్తున్నారు.ఇటీవలే తాజాగా రిలీజ్ అయినా పాన్ ఇండియా చిత్రం పుష్ప లో సునీల్ మంగళం శ్రీను అనే ముఖ్య పాత్రలో కనిపించారు.ఈ చిత్రంలో మంగళం శ్రీను ది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.విలన్ కూడా నటించి ఈ చిత్రంతో తన టాలెంట్ నిరూపించుకున్నారు సునీల్.సునీల్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది అన్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే సునీల్ వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఫ్యామిలీ గురించి చాల మందికి తెలియదు.సునీల్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే తన బంధువుల అమ్మాయి అయినా శృతి ని పెళ్లి చేసుకున్నారు.సునీల్,శృతి దంపతులకు ఒక పాపా మరియు ఒక బాబు ఉన్నారు.ప్రస్తుతం సునీల్ వేదాంతం రాఘవయ్య అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ మరియు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంబినేషన్లో తెరెకెక్కనున్న ఆర్ సి 15 లో ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని సమాచారం.
View this post on Instagram