Preeti Jhangiani: యూత్ ఫెవరేట్ హీరోయిన్ గా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూ పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది ‘ప్రీతి జింగానియా’. ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన ఈ తారది ముంబై. మలయాళంలో మూవీతో ఇండస్ర్టీకి ఎంట్రీ ఇచ్చింది జింగానియా. కానీ పవన్ కల్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటించిన ‘తమ్ముడు’తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు ఇండస్ర్టీని ఆకట్టుకుంది. ‘అధిపతి’ ‘నరసింహ నాయకుడు’ ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’లో నటించింది. యమదొంగలో ఒక స్పెషల్ సాంగ్ చేసి అందాలను ఆరోబోసింది ఈ ముంబై ముద్దుగుమ్మ.
ప్రీతి జింగానియా దాదాపు అన్ని భాషా చిత్రాలలో యాక్ట్ చేసింది. 2008లో వివాహం చేసుకున్న ఆమె అప్పటి నుంచి చిత్ర సీమకు దూరంగా ఉంటూ వస్తుంది. 42 సంవత్సరాల్లోనూ తన గ్లామర్ ను ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ ఈ మధ్య కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది.
ఇన్ స్టా మాధ్యమంగా షేర్ చేసిన ఫొటోలు సినీ ప్రేక్షకులు, తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దానికి తగ్గట్లుగా నెటిజన్లు వివిధ రూపాల్లో కామెంట్లు చేస్తున్నారు. ఇండస్ర్టీలో అందరి హీరోయిన్ల లాగా సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.
View this post on Instagram